Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ పోర్టు లాంజ్ లోకి దూరిన కోతి.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫన్నీ వీడియో..

Funny Video: ఇటీవల కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవులను పూర్తిగా నాశనం చేయడం వలన ఆకలితో జంతువులన్ని

ఎయిర్ పోర్టు లాంజ్ లోకి దూరిన కోతి.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫన్నీ వీడియో..
Video
Follow us
Rajitha Chanti

|

Updated on: May 21, 2021 | 10:59 PM

Funny Video: ఇటీవల కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవులను పూర్తిగా నాశనం చేయడం వలన ఆకలితో జంతువులన్ని గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. కేవలం ఊర్లలోకి మాత్రమే కాదు.. పట్టణాల్లోకి సైతం వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఏనుగులు, కోతులు, పులులు, ఎలుగు బంటి ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఊర్లలో కోతుల బెడద ఎక్కువగానే ఉంది. గ్రామాల్లోకి చేరిన కోతులు పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా.. ఇళ్లలోకి చోరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోతున్నాయి. తాజాగా ఓ కోతి మాత్రం ఏకంగా విమానాశ్రయంలోకే దూరింది. అక్కడ ఆ వానరానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ కోతి విమానాశ్రయంలోని లాంజ్‏లో కూర్చోని స్వీట్ తింటూ కూర్చుంది. కాసేపటికి అక్కడి నుంచి మరోక చోటికి వెళ్లి అక్కడున్న వంటకాలను తింటూ.. ఆ లాంజ్‏లో ఎంతో హుందాగా తిరుగుతూ.. నచ్చిన వాటిని తింటూ ఉంటుంది. అక్కడే ఉన్న కొంత మంది సిబ్బంది కోతిని చేస్తున్న పనిని వీడియో తియడంతో.. వెంటనే ఆ కోతి తనకు నచ్చిన అరటి పండు తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో అక్కడి సిబ్బంది ఒకరు యూట్యూబ్ లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 16,000 మంది వీక్షించారు. నివేదికల ప్రకారం ఆ కోతులు టెర్నినల్ లోపల ఐదు రోజుల పాటు ఆశ్రయం పొందాయని.. ఆ తర్వాత అధికారులు వచ్చి వాటిని రక్షించారు.

వీడియో..

Also Read: Black Fungus, White Fungus : బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్.. వీటిలో ఏది డేంజర్? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం.. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన

Dogs Sniffing Corona : కరోనా సోకిన వారిని పసిగడుతున్న శునకాలు..! సెకన్ల వ్యవధిలో ఫలితాలు తేల్చేస్తున్నాయి.. ఎక్కడో తెలుసా..?

బీపీని తగ్గించుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే.. బ్లడ్ ప్రెషర్ నియంత్రణ ఇలా..