కరోనాను జయించిన పోలీసులకు సన్మానం
కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానించారు. లాక్‌డౌన్ సమయంలో విధి నిర్వాహణలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు..
కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిని ఇబ్బంది పెడుతోంది. రోజు రోజుకు కరోనాతో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ ఉద్యోగుల పాలిట శాపంగామారుతోంది. ఇందులో కొందరని మృత్యువు కౌగిలిస్తే.. మరి కొందరు పోరాడి గెలుస్తున్నారు. ఇలా విధి నిర్వహణలో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఇలా కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానించారు. లాక్‌డౌన్ సమయంలో విధి నిర్వాహణలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 500 మంది పోలీసులు కొవిడ్‌ను జయించి మళ్లీ విధుల్లోకి చేరారు.
పోలీసుల సేవలను గుర్తించి సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డీసీపీ మల్కాజిగిరి రక్షిత మూర్తి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.