లడఖ్‌లో మోహరించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు
గాల్వాన్ ఘటన తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. ఏ క్షణానైనా సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలను తిప్పికొట్టేందేకు భారత్ సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో రెండు లైట్ కంబాట్ హెలికాప్టర్లలను భారత్ మోహరించింది. ఇవి లేహ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
గాల్వాన్ ఘటన తర్వాత భారత సైన్యం అప్రమత్తమైంది. ఏ క్షణానైనా సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలను తిప్పికొట్టేందేకు భారత్ సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో రెండు లైట్ కంబాట్ హెలికాప్టర్లలను భారత్ మోహరించింది. ఇవి లేహ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. భారత వాయు సేన కార్యకలాపాల్లో ఈ హెలికాప్టర్లు పాల్గొంటాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసింది. హెచ్ఏఎల్ బుధవారం ఈ వివరాలను ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
హెచ్ఏఎల్ సీఎండీ ఆర్ మాధవన్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో హెచ్ఏఎల్ పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రపంచంలోనే అతి తేలికైన యుద్ధ హెలికాప్టర్లను తాము తయారు చేశామని, వీటిని భారతీయ సాయుధ దళాల అవసరాలకు తగిన విధంగా రూపొందించామని తెలిపారు.ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కూడినవి. పగలు, రాత్రి ఎలాంటి లక్ష్యాన్ని అయినా కచ్చితంగా ఛేదించగలవని పేర్కొన్నారు. వేర్వేరు పరిస్థితుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు ఆయుధాలను మోసుకువెళ్లగలవని స్పష్టం చేశారు. అధిక వేడిగల, ఎత్తయిన ప్రదేశాల్లో ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయని ట్వీటర్ వేదికగా మాధవన్ వెల్లడించారు. త్వరలోనే భారత్ వైమానిక దళంలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానానికే ఎక్కవ ప్రధాన్యత ఇస్తోంది రక్షణ రంగ శాఖ. అందులో భాగంగా వంద రకాలైన ఆయుధాలను ఇక నుంచి ఇండియాలోనే తయారు చేయ్యాలని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి వరకు 10 తేలికపాటి రక్షన హెలిక్యాప్టర్లును నేవీకి, మరో ఐదు హెలిక్యాప్టర్లని ఆర్మీకి అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. రాబోయే సంవత్సరంలో నేవీ, ఆర్మీకి 160 వరకు హెలిక్యాప్టర్లు అవసరం ఉందని హెచ్‌ఏఎల్ ప్రకటించింది. ఇది లడ్డాక్ ఏరియాలో ఉండే వాతావరణానికి అనుగుణంగా అత్యాధునికంగా ఉన్న రెండు ఇండజన్లతో తయారు చేశారు. ఇది శత్రు దేశానికి నష్టం కలిగించడంతో పాటు.. ఏయిర్ టు ఏయిర్ ఆయుధాలను పేల్చకలదు. దీని నుంచి 70MM రాకెట్స్‌ను కూడా పేల్చగలదు.
HAL’s Mr R Madhavan, CMD: “In light of the prevailing situation on the border, HAL produced two Light Combat Helicopters (LCH) have been deployed for operations at high altitude (Leh sector) at short notice to support IAF missions”.
1/2 pic.twitter.com/EyG82fJZ06
— Vayu Aerospace Review (@ReviewVayu) August 12, 2020