ఇరవయ్యో సారి, కోవిడ్-19 కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా, ప్రీతి జింటా

బాలీవుడ్ నటి, ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో-ఓనర్ అయిన ప్రీతి జింటా తాజాగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. ఐపీఎల్ క్రీడాకారులతో బాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి...

ఇరవయ్యో సారి, కోవిడ్-19 కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా, ప్రీతి జింటా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2020 | 11:32 AM

బాలీవుడ్ నటి, ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో-ఓనర్ అయిన ప్రీతి జింటా తాజాగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. ఐపీఎల్ క్రీడాకారులతో బాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సురక్షిత ఆరోగ్యానికి తోడ్పడే బయో బబుల్స్ రూల్స్ ని ఈమె ఖఛ్చితంగా పాటిస్తోంది. ప్రతి కొన్ని రోజులకొకసారి తాను ఈ టెస్ట్ చేయించుకుంటున్నానని ఓ వీడియోలో తెలిపింది. బహుశా ఇది 20 సారి అనుకుంటా అని పేర్కొంది. ఇలా టెస్టులు చేయించుకుని తను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతీ జింటా చమత్కరించింది. బయో బబుల్ అంటే బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే ! అయితే ఈమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తీరు సరిగా లేదని నెటిజనులు అంటున్నారు. ఇదేదో తమాషా వ్యవహారంలా ఉందన్నది వారి ‘వాదన’.