AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెనీలియా భర్త అనగానే నా ఇగో హర్ట్‌ అయ్యింది: రితేష్‌

జెనీలియా.. పుట్టింది ఉత్తర భారతదేశంలో అయినా దక్షిణాది హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. హిందీలో పోలిస్తే ఇక్కడ ఆమెకు మంచి మంచి పాత్రలను ఇచ్చారు దర్శకులు

జెనీలియా భర్త అనగానే నా ఇగో హర్ట్‌ అయ్యింది: రితేష్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 21, 2020 | 12:17 PM

Share

Riteish Deshmukh Genelia: జెనీలియా.. పుట్టింది ఉత్తర భారతదేశంలో అయినా దక్షిణాది హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. హిందీలో పోలిస్తే ఇక్కడ ఆమెకు మంచి మంచి పాత్రలను ఇచ్చారు దర్శకులు. ఆ విషయాన్ని జెనీలియా సైతం పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. తనను దక్షిణాది వారు చాలా ఆదరిస్తారని ఆమె తెలిపారు. కాగా వ్యక్తిగత జీవితంలో జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2011లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా.. ఈ ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే జెనీలియాను దక్షిణాది వారు ఎంతగా ఆదరిస్తారో రితేష్‌ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ప్రముఖ టీవీ ప్రోగ్రాం కామెడీ విత్‌ కపిల్‌ శర్మ షోలో రితేష్‌, జెనీలియా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో ఓ విషయాన్ని రితేష్‌ పేర్కొన్నారు. బెంగళూరులో నేను క్రికెట్ లీగ్ చూడటానికి వెళ్లినప్పుడు.. ఇద్దరు గుసగుసలాడుకున్నారు. నేను చూస్తే మీరు జెనీలియా భర్త కదా అని అడిగారు. ఆ మాటకు నా ఇగో హర్ట్ అయ్యింది. వెంటనే వారితో ఇక్కడ నేను జెనీలియా భర్తను, కానీ మహారాష్ట్రలో ఆమె రితేష్‌ భార్య అని చెప్పాను. అప్పుడు వారు సర్ ఒక్క రాష్ట్రంలోనే జెనీలియాను రితేష్‌ భార్య అంటారు. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అని అంటారు అని చెప్పారు. రితేష్ ఈ విషయం చెప్పగానే అక్కుడున్న అందరూ గట్టిగా నవ్వారు. అయితే జెనీలియా ఒక్కటే కాదు.. ఉత్తరాదికి చెందిన కాజల్‌, ఇలియానా సహా పలువురు ఇప్పటికీ దక్షిణాది హీరోయిన్లుగానే చలామణి అవుతున్నారు. వారికి ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Read More:

మోసం చేస్తూ దొరికిన డెలివరీ బాయ్.. అరెస్ట్‌

Corona Updates: దేశంలో కొత్తగా 54,044 పాటిజివ్‌ కేసులు

https://www.instagram.com/p/CGjpjouKq3_/?utm_source=ig_embed

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు