ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలి టీచర్ మృతి!
అనంతపురం జిల్లా: ఎన్నికల విధులు ఓ ఉపాధ్యాయురాలి ప్రాణాలను బలిగొన్నాయి. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ (56) అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలి మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లుకు చెందిన హరిత గౌడ్ రాయదుర్గం మండలం ఖాదలూరులో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆమెకు కడదరకుంట పోలింగ్ కేంద్రంలో బాధ్యతలు అప్పగించారు. అయితే విధుల్లో ఉండగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు ఆయాసం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి వెళ్లాలని అక్కడే ఉన్న తోటి ఎన్నికల సిబ్బందికి తెలిపారు. అయితే రిటర్నింగ్ అధికారి అనుమతి కోసం వేచి ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆమెను కూడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హరిత గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎన్నికల విధుల్లో ఉండగానే ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది, ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..