భారీగా పెరిగిన వరద ప్రవాహం.. గండిపేట చెరువు దగ్గరకు నో ఎంట్రీ

హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుండి పదేళ్ల తర్వాత చెరువులోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం చెరువు నీటిమట్టం 1790 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగుల మేర నీరు వస్తే గండిపేట్ చెరువు గేట్స్ తెరవనున్నారు. పదేళ్ల అనంతరం పెద్ద ఎత్తున గండిపేటలోకి వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేస్తూ.. మంచిరేవుల, నార్సింగి, […]

భారీగా పెరిగిన వరద ప్రవాహం.. గండిపేట చెరువు దగ్గరకు నో ఎంట్రీ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 21, 2020 | 11:32 AM

హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుండి పదేళ్ల తర్వాత చెరువులోకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం చెరువు నీటిమట్టం 1790 అడుగులకు చేరింది. మరో నాలుగు అడుగుల మేర నీరు వస్తే గండిపేట్ చెరువు గేట్స్ తెరవనున్నారు. పదేళ్ల అనంతరం పెద్ద ఎత్తున గండిపేటలోకి వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేస్తూ.. మంచిరేవుల, నార్సింగి, హైదర్షాకోట్ వాసులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఏ క్షణమైనా గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని.. పరిసరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయంతో ఆయా ప్రాంతాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గండిపేట్ చెరువు వద్దకు ఎవ్వరినీ పంపించడం లేదు. గండిపేట చెరువు దగ్గరకు ఎవర్నీ రానివ్వకుండా నార్సింగి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.