గుడిలో గుప్తనిధులు..! తవ్వకాల్లో 505 బంగారు నాణేలు

ఆ ఆలయంలో గుప్తనిధులు బయటపడ్డాయి. తవ్వకాల్లో వందల కేజీల బంగారు నాణేలు లభించాయి. ఓ కుండలో దాచివుంచిన బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..?

గుడిలో గుప్తనిధులు..! తవ్వకాల్లో 505 బంగారు నాణేలు
Follow us

|

Updated on: Feb 27, 2020 | 3:56 PM

ఆ ఆలయంలో గుప్తనిధులు బయటపడ్డాయి. తవ్వకాల్లో కేజీల కొద్దీ బంగారు నాణేలు లభించాయి. ఓ కుండలో దాచివుంచిన బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..?

తమిళనాడు తిరుచరాపల్లి జిల్లాలోని బంబుకేశ్వర్ ఆలయంలో బంగారంతో నిండిన కుండ బయటపడింది. దాని నిండా బంగారు నాణేలను గుర్తించారు అధికారులు. అఖిలాండేశ్వరి ఆలయం చుట్టురా పార్కు ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు చేపట్టారు. కూలీలు తవ్వకాలు జరుపుతుండగా వారికి ఇనుముతో చేసిన కుండ తగిలింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా 505 బంగారు నాణేలు కనిపించాయి. ఆలయ అధికారులు విషయాన్ని శ్రీరంగం రెవ్యూ అధికారులకు తెలిపారు. స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో అక్కడ లభించిన బంగారు నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయటపడ్డ బంగారం బరువు 1.716 కేజీలు ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఈ బంగారు నాణేలను ఆర్కియాలజీ అధికారులకు అప్పగిస్తామని తహసిల్దార్‌ చెప్పారు.