AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2021: న్యూఇయర్ విషెస్ తెలిపిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ నాయకులు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్..

2020 సంవత్సరం అందరి జీవితాలలో ఒక కొత్త మార్పును తీసుకువచ్చింది. కొందరికి జీవితాల్లో చీకట్లను నింపింది. 2020 కొంత చెడు చేసిన కొన్ని మంచే చేసింది.

New Year 2021: న్యూఇయర్ విషెస్ తెలిపిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ నాయకులు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్..
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2021 | 11:59 AM

Share

celebrities new year wishes: 2020 సంవత్సరం అందరి జీవితాలలో ఒక కొత్త మార్పును తీసుకువచ్చింది. కొందరికి జీవితాల్లో చీకట్లను నింపింది. 2020 కొంత చెడు చేసిన కొన్ని మంచే చేసింది. ఏది ఏమైనా 2020 ఏడాది ముగిసింది. అందరు ఎంతో సంతోషంగా.. ఎన్నో ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. అటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jan 2021 11:58 AM (IST)

    అభిమానులకు న్యూఇయర్ విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్..

    “2021 ఇది మొదటి ఉదయం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం అందించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్” అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు.

  • 01 Jan 2021 11:47 AM (IST)

    న్యూఇయర్ విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి..

    ఈ నూతన సంవత్సరం ప్రజలందరికి సంతోషాన్ని అలాగే శాంతిని అందించాలి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

  • 01 Jan 2021 11:41 AM (IST)

    న్యూఇయర్ విషెస్ తెలిపిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి..

    రాష్ట్ర ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. “కరోనా కష్టాలను వెనక్కు నెట్టుతూ.. ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తెలిపారు.

  • 01 Jan 2021 11:35 AM (IST)

    రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు..

    “2021లో రాష్ట్ర ప్రజలందరు తాము తీసుకున్న నిర్ణయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు నీటి సరాఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

  • 01 Jan 2021 11:26 AM (IST)

    ఫ్యాన్స్‏కు న్యూఇయర్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..

    తెలుగు హీరో వరుణ్ తేజ్ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. 2021 ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాల్ని నింపాలని కొరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఇటీవల వరుణ్ తేజ్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం ఐసోలేషన్‏లో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు ఈ మెగా హీరో.

  • 01 Jan 2021 11:08 AM (IST)

    అభిమానులకు న్యూఇయర్ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..

    టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తీయబోయే ‘అయినను పోయిరావలె హస్తినకు’ చిత్రీకరణలో పాల్గొనున్నట్లుగా సమాచారం.

  • 01 Jan 2021 10:59 AM (IST)

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఈటెల రాజేందర్..

    “ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలిపారు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి ఈటెల రాజెందర్.

  • 01 Jan 2021 10:54 AM (IST)

    ప్రజలకు న్యూఇయర్ విషెస్ తెలిపిన ఎమ్మెల్సీ నారా లోకేష్..

    “గత సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. అందరం ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ చిరునవ్వులను పంచాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు”.. అంటూ ట్వీట్ చేశాడు.

  • 01 Jan 2021 10:50 AM (IST)

    ‘కొత్త సంవత్సరం శుభాకాంక్షలు’ తెలిపిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి..

    “మనం కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించాం. ఈ నూతన సంవత్సరం రాష్ట్రానికి అలాగే ప్రజలకు శాంతి మరియు అత్యంత సంపదను తీసుకురావాలి. అలాగే మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు మరింత బలం చేకూరాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

  • 01 Jan 2021 10:40 AM (IST)

    ఫ్యాన్స్‏కు ‘న్యూఇయర్’ విషెస్ చెప్పిన హీరో రామ్ చరణ్..

    “ఈ సంవత్సరం మన అందరికీ ఎన్నో భరించలేని కష్టాలని పరిచయం చేసింది. కానీ మనం రెట్టింపు బలంతో ముందుకు సాగటానికి సిద్ధం అయ్యాం. ఇలాగే మన అందరి బంధం మరింత బలంగా మారాలి. అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.

  • 01 Jan 2021 10:33 AM (IST)

    కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

    “ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2020 సంవత్సరంలో నెర్చుకున్న పాఠాల నుంచి ముందుకు కదిలి 2021 సంవత్సరం మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

  • 01 Jan 2021 10:23 AM (IST)

    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

    “గత సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించి.. మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను, విజయాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రజలందరీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • 01 Jan 2021 10:17 AM (IST)

    2021 న్యూఇయర్ విషెస్ తెలిపిన అక్కినేని నాగార్జున..

    టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అందులో.. ఈ కొత్త సంవత్సరం నూతన ప్రపంచంలో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.

  • 01 Jan 2021 10:11 AM (IST)

    అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని..

    జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా.. ” దేశ ప్రజలకు కొవిడ్ టీకా నుంచి రక్షణ పొందాలని, అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. దేశప్రజలు, తెలుగు వారికి నా తరపున, జనసేన శ్రేణుల తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.

  • 01 Jan 2021 10:00 AM (IST)

    అభిమానులకు ఎమోషనల్‏గా మెగాస్టార్ చిరంజీవి న్యూఇయర్ విషెస్..

    2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశాడు. అందులో.. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ట్వీట్ చేశారు.

Published On - Jan 01,2021 11:58 AM