తమిళనాడులో తీవ్ర విషాదం.. సెల్‌ఫోన్ పేలి విద్యార్థి మృతి.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి..

చార్జింగ్ పెట్టి సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

తమిళనాడులో తీవ్ర విషాదం.. సెల్‌ఫోన్ పేలి విద్యార్థి మృతి.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 11:38 AM

Teen Dies After Cellphone Explodes: చార్జింగ్ పెట్టి మొబైల్ ఫోన్లను వాడొద్దంటూ నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చార్జింగ్ పెట్టి సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సెల్‌ఫోన్ పేలడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతడి తండ్రి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరూర్‌ జిల్లా చిన్నతారాపురానికి చెందిన బాలాజీ 12వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బాలాజీ తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టాడు. దీంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కి పెద్ద శబ్ధంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు కళ్ల ముందున్న కొడుకు విగతజీవిగా మారడంతో తట్టుకోలేని తండ్రి చెల్లముత్తు (40) గుండెపోటుకు గురై చనిపోయాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.