Lord Rama idol vandalised: ఏపీలో రాముడి విగ్రహం ధ్వంసంపై బీజేపీ నేత సునీల్ దియోధర్ ఆగ్రహం..
Lord Rama idol vandalised: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్..
Lord Rama idol vandalised: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ తీవ్రంగా స్పందించారు. 300 ఏళ్ల ముందు బాబర్ ధ్వంసం చేసిన అయోధ్య రామ మందిరాన్ని కేంద్రం పునర్నిస్తుందటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉన్న దేవాలయాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను సునీల్ దియోధర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరం అన్నారు. దేవాలయాలను, విగ్రహాలు, రథాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను రక్షించాలని శ్రీవారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.
Also read:
MLC Challa Ramakrishnareddy : ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత.. విషాదంలో వైసీపీ నేతలు..
విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనేందుకు అవకాశం