లాక్ డౌన్ నేపథ్యంలో.. కర్ఫ్యూ పాస్‌లు అడిగారని.. పోలీసు చేయి నరికేశారు..

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా 200 దేశాల‌కు పైగా పాకింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను అమలు

లాక్ డౌన్ నేపథ్యంలో.. కర్ఫ్యూ పాస్‌లు అడిగారని.. పోలీసు చేయి నరికేశారు..
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 1:30 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా 200 దేశాల‌కు పైగా పాకింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని పోలీసులు అడ్డుకోగా.. కొందరు పోలీసులపై దాడులకు కూడా తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో చోటు చేసుకుంది.

కోవిద్ 19 ఇప్పుడు భారత్ లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఒక వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు నిహంగాలను(ఆయుధాలు ధరించి ఉన్న సిక్కులు) ఓ కూరగాయల మార్కెట్ సమీపంలో ఆదివారం ఉదయం 6.15 నిమిషాలకు మండీ బోర్డు అధికారులు అడ్డుకున్నారు. ‘‘వాళ్లను కర్ఫ్యూ పాస్‌లు చూపించమని పోలీసులు అడిగారు. కానీ, వాళ్లు ఆగకుండా అక్కడ ఉన్న బ్యారికేడ్లు, గేట్లను ఢీకొడుతూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు’’ అని పటియాలా ఎస్పీ మన్‌దీప్ సింగ్ సిధు తెలిపారు.

కాగా.. తర్వాత వాళ్లని పోలీసులు అడ్డుకోగా.. పోలీసులపై వారు ఆయుధాలతో దాడి చేశారని పేర్కొన్నారు. ‘‘ఈ దాడిలో ఒక ఏఎస్‌ఐ చేయిని నరికేశారు. ఒక స్టేషన్ హౌస్ అఫీసర్, మరో అధికారి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు’’ అని సిధు అన్నారు. ఆ ఏఎస్‌ఐని వెంటనే రాజీంద్ర ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు అతన్ని పీజీఐఎంఈఆర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే దాడికి తెగబడిన నిహంగాలు అక్కడి నుంచి పారిపోయారని.. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.