కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు గడగడలాడుతున్నాయి. దాదాపు 250 దేశాలకు పాకిన ఈ మహమ్మారి కారణంగా లక్షల్లో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. ఈ కనిపించని శత్రువు ఎలా సోకుతుందో తెలుసుకుని జనాలు వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కరెన్సీ నోట్ల వల్ల కోరనా సోకుతుందని ప్రచారం జరగడంతో కర్ణాటకలో కొందరు డబ్బును కాల్చి బూడిద చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని కల్బుర్గి జిల్లా సుంటనురు గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకుని వచ్చి.. కొద్దిసేపు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత కరెన్సీ నోట్లను పారేసి వెళ్ళిపోయారని స్థానిక మహిళలు చెబుతున్నారు. వాళ్లు కరోనా బాధితులు అయ్యి ఉంటారని అనుమానం వచ్చి పిల్లలు ముట్టకుండా వాటిని మట్టితో మూయించామని.. ఆ తర్వాత గ్రామస్తులకు సమాచారం ఇచ్చామన్నారు. వారు వచ్చి మట్టి నుంచి వాటిని తీసి కాల్చివేశారు. ఇక వారు చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది చదవండి: షాక్: ఐఏఎస్ ఆఫీసర్ మూర్ఖత్వంతో.. ఏకంగా 36 మందికి కరోనా..