AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడప రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కారణంగానే కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వల్లూరు సమీపంలోని గోటూరు వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొన్న...

కడప రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్
Sanjay Kasula
|

Updated on: Nov 04, 2020 | 1:01 AM

Share

Smuggling of Red SandalWood :  ఎర్రచందనం స్మగ్లింగ్‌ కారణంగానే కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వల్లూరు సమీపంలోని గోటూరు వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో టిప్పర్‌ను ఢీకొన్న స్కార్పియో వాహనంలో మొత్తం 8 మంది ఉంటే ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతులు రాజన్‌, మహేంద్రన్, రామచంద్రన్‌, ముకియన్‌, సందిరన్‌గా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

అయితే స్కార్పియోలో నుంచి రిషి అనే వ్యక్తి ఘటనా స్థలి నుండి పరారయ్యాడు. మణి అనే వ్యక్తి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో చనిపోయిన వారి కోసం తమిళనాడు నుంచి వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న మణిని చూసి తల్లి, సోదరి బోరున విలపించారు.

మిగితా వాళ్ళ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించారు పోలీసులు. గుర్తు పట్టేందుకు శాంపిల్స్‌ని DNA టెస్టుల కోసం పంపారు. రిపోర్ట్‌ రాగానే మహేంద్రన్‌ మృతదేహంతో పాటు మిగిలిన వారి మృతదేహాల్ని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పిగిస్తామన్నారు. మృతుల బంధువులు మాత్రం తమ వాళ్లు స్మగ్లర్లు కాదని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రమాదంలో కాలిపోయిన స్కార్పియోలో పాక్షికంగా దగ్దమైన 18 ఎర్ర చందనం దుంగల్ని గుర్తించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సేలం జిల్లాకు చెందిన స్మగ్లర్ చంద్రన్‌ ద్వారా ఎర్రచందనం తీసుకెళ్లేందుకు వచ్చారు. ప్లాన్‌లో భాగంగానే ఎర్రచందనం తీసుకెళ్తుండగా .. స్మగ్లర్ల కారును వెనుక నుంచి మరో కారు ఫాలో అయింది.

అది గమనించిన స్మగ్లర్లు తప్పించుకునే క్రమంలో కారును వేగంగా నడిపి డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న స్మగ్లర్ల గ్యాంగ్‌.. వెనుక వస్తున్న మరో వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

ఈ మొత్తం ఘటనలో పరారైన రిషీ అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. స్కార్పియోను వెంబడించిన ఇతియోస్ కారులో ఉన్నవారు ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. ఈ సీన్ మొత్తం సినీ ఫక్కీలో జరిగింది.

ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే