AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీ రెడీ టు టోక్యో ఒలంపిక్స్ ! ప్రధాని మోదీ ప్రకటన….అథ్లెట్ల వ్యాక్సినేషన్ తప్పనిసరని సూచన…సన్నాహాలపై సమీక్ష

టోక్యో ఒలంపిక్స్ దాదాపు మరో రెండు నెలల్లో జరగనుండగా ప్రధాని మోదీ గురువారం ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు.

బీ రెడీ టు టోక్యో ఒలంపిక్స్ ! ప్రధాని మోదీ ప్రకటన....అథ్లెట్ల వ్యాక్సినేషన్ తప్పనిసరని సూచన...సన్నాహాలపై సమీక్ష
Pm Reviews Olympic
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 03, 2021 | 7:11 PM

Share

టోక్యో ఒలంపిక్స్ దాదాపు మరో రెండు నెలల్లో జరగనుండగా ప్రధాని మోదీ గురువారం ఈ మెగా స్పోర్ట్స్ కి సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. ‘కరోనా వైరస్ పాండమిక్ షాడో’ కింద మొదటిసారిగా నిర్వహించనున్న క్రీడా సంరంభంపై ఆయన అత్యంత ఆసక్తిని చూపారు. జులైలో మన క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతానని ప్రకటించారు. జపాన్ దేశానికి వెళ్లే ప్రతి క్రీడాకారుడూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. వారిని ఎంతగానో ప్రోత్సహిస్తానని, గర్వించదగిన ఈ దేశం మీకు అండగా ఉంటుందని చెబుతానని ఆయన అన్నారు. స్పోర్ట్స్ మన దేశ క్యారక్టర్ లో ఓ భాగం.. మన యువత క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతారని ఆశిస్తాను అని ఆయన చెప్పారు. 135 కోట్లమంది భారతీయుల ఆశలు, కోర్కెలు ఈ ఒలంపిక్స్ లో పాల్గొనే యువతపైనే ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ నుంచి శిక్షణా సౌకర్యాలవరకు వారికి అవసరమైన ప్రతి అంశానికీ ప్రాధాన్యమివ్వాలని ప్రధాని అధికారులను కోరారు. కాగా అథ్లెట్లకు నిరంతర శిక్షణ లభించేలా చూడడం, ఒలంపిక్ పతకాలు దక్కించుకునేలా వారిని ఈ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం చేయడం, వారికి వ్యాక్సినేషన్ వంటి వాటిపై అధికారులు మోదీకి వివరించారు. ఓ ప్రెజెంటేషన్ సమర్పించారు.ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని మోదీ మరీమరీ చెప్పారు. ఈ పోటీల్లో ఎవరు ప్రతిభ చూపినా మరో వెయ్యిమంది క్రీడాకారులకు అది స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలంపిక్స్ కి మొత్తం 100 మంది అథ్లెట్లు క్వాలిఫై అయ్యారని, మరో 25 మంది కూడా క్వాలిఫై కావచ్చునని అధికారులు మోదీకి తెలియజేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: 8 ఏళ్ల బాలిక సాహసం.. రైలు నుంచి కిందకి తోసేసినా.. ధైర్యం కోల్పోలేదు.. నిందితుడిని పట్టించింది.!

WWW Movie: యూట్యూబ్‏లో శివాని రాజశేఖర్ క్రేజ్.. కొత్త రికార్డులను సృష్టిస్తున్న ‘కన్నులు చెదిరే’ సాంగ్..