WWW Movie: యూట్యూబ్‏లో శివాని రాజశేఖర్ క్రేజ్.. కొత్త రికార్డులను సృష్టిస్తున్న ‘కన్నులు చెదిరే’ సాంగ్..

ప్రస్తుతం సినిమా స్టోరీతో సంబంధం లేకుండా సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే విడుదలై రికార్డులు సృష్టిస్తున్నాయి.

WWW Movie: యూట్యూబ్‏లో శివాని రాజశేఖర్ క్రేజ్.. కొత్త రికార్డులను సృష్టిస్తున్న ‘కన్నులు చెదిరే’ సాంగ్..
Www
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 7:08 PM

ప్రస్తుతం సినిమా స్టోరీతో సంబంధం లేకుండా సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే విడుదలై రికార్డులు సృష్టిస్తున్నాయి. మూవీలోని ఒక్క సాంగ్ సూపర్ హిట్ అయితే చాలు.. ఆడియెన్స్‏కు సినిమా పై ఆసక్తిని కలిగించవచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారు మేకర్స్. అందుకే సినిమాలోని పాటలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు మూవీ సాంగ్స్ యూట్యూబ్‏లో రికార్డులు సృష్టిస్తుండగా.. తాజాగా మరో సాంగ్ కొత్త రికార్డ్ సృష్టిస్తుంది.

అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్లూ (WWW). ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహిస్తుండగా.. రామంత్ర క్రియోషన్స్ బ్యానర్ పై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని కనులు చెదిరే లిరికల్ వీడియో సాంగ్ ను ఇటీవల మేజర్ అడవి శేఖ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ‘కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే…’ అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఆక‌ట్టుకుంటూ యూట్యూజ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిచగా.. యాజిన్ నిజార్ గాత్రం.. సైమన్ కె కింగ్ బాణీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఈ సాంగ్ ఇంతటి ఆదరణ దక్కించుకున్నందుకు నిర్మాత డా. రవి పి.రాజు మాట్లాడుతూ.. 1 మిలియన్ కి పైగా ఆర్గానిక్ వ్యూస్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా ఈ పాట విడుదల చేసిన అడవి శేష్ కు, అదిత్య మ్యూజిక్ కు దన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 118 లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కించిన గుహన్.. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇలా wwwతో మరో ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

వీడియో..

Also Read: Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ‘సర్కారు వారి పాట’ షూట్ మొదలయ్యేది అప్పుడే..

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… డైరెక్టర్ ఎవరంటే..