Mohammed Siraj: తండ్రి మృతితో బాధలో ఉన్నా.. ఆయన వచ్చి ఆ మాటలు చెప్పడంతో.. కీలక విషయాలు వెల్లడించిన సిరాజ్..
Mohammed Siraj: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ వేధికంగా...
Mohammed Siraj: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ వేధికంగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోనూ పాల్గొననుంది. అయితే, టీమిండియా ప్లేయర్లు ఇంగ్లండ్ టూర్‌కు బయలుదేరే ముందు విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, ఇతర క్రికెటర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. తన తండ్రి మృతి గురించి గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి చనిపోయిన సమయంలో టీమ్ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తనకు చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చాడు. తన వెన్నుతట్టి ప్రోత్సహించారని అన్నాడు. ఆ ప్రోత్సాహం వల్లే తాను ఆసిస్ టూర్‌లో రాణించగలిగానని అన్నాడు.
‘‘ఆసిస్ టూర్‌లో ఉండగా మా నాన్న చనిపోయారని వార్త అందింది. ఆ సమయంలో చాలా బాధలో ఉన్నాను. అప్పుడే చీఫ్ కోచ్ రవిశాస్త్రి సర్.. బౌలింగ్ కోచ్ అరుణ్ సర్ నాకు అండగా నిలిచారు. నా దగ్గరకు వచ్చి మీరు మ్యాచ్ ఆడండి.. మీ తండ్రి ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మీరు బాగా రాణిస్తారు. వికెట్లు పడగొడతారు. అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. చాలా ధైర్యం చెప్పారు. వారిచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మ్యాచ్ ఆడాను. వారి ప్రోత్సాహంతో నాలో విశ్వాసం పెరిగింది. ఫలితంగా ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడటంతో నా కెరియర్‌ను మలుపు తిరిగింది.’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధికంగా 13 వికెట్లు.. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మెల్బోర్న్‌లో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన కెప్టెన్ కోహ్లీ అతనిపై ప్రశంసలు కురిపించాడు. అది గుర్తు చేసుకున్న సిరాజ్.. విరాట్ కోహ్లీ తనకు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను బాగా రాణించకపోయినా, తనపై విశ్వాసం కలిగి ఉన్నారని అన్నాడు. ఈ విషయంలో కోహ్లీకి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చాడు సిరాజ్.
Also read:
Sharmila YSRTP: కొత్త పార్టీ పేరు ఖరారు.. గుర్తింపు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. జులైలో ప్రకటన!