Gautam Gambhir: ఫ్యాబీఫ్లూ డ్రగ్ వివాదం.. భగత్‌సింగ్ సూక్తిని ట్విట్ చేసిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir quotes Bhagat Singh: తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా
Gautam Gambhir quotes Bhagat Singh: తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికంగా కొనుగోలు చేసి ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారని ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ హైకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. అక్రమంగా నిల్వ చేసి పంపణీ చేశారని నివేదికలో వెల్లడవ్వడంతో మీడియాలో పలు కథనాలు వచ్చాయి. దీనిపై గౌతం గంభీర్ స్పందించారు. ఈ మేరకు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ సూక్తిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నేను మనిషిని.. మానవాళిని ప్రభావితం చేసేవన్నీ.. నాలో ఆందోళనను కలిగిస్తాయి – సర్దార్ భగత్‌సింగ్’ అని గంభీర్ పోస్ట్ చేశారు. ఫాబి ఫ్లూ ఔషధం పంపిణీలో తానెలాంటి తప్పు చేయలేదని, అంతేగాక ప్రజల బాగు కోసం తాను చేయాల్సిందంతా చేశానంటూ పరోక్షంగా వెల్లడించారు.
I am a man and all that affects mankind concerns me – Sardar Bhagat Singh!
— Gautam Gambhir (@GautamGambhir) June 3, 2021
దీంతోపాటు మరో ట్విట్‌ను కూడా గంభీర్ చేశారు. ఢిల్లీకి మొత్తం తెలుసంటూ ట్విట్ చేశారు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ఆసుపత్రులతో ఉచిత టీకా శిబిరాన్ని నిర్వహిస్తోందని.. ఆసక్తి కలిగిన వారు మెస్సెజ్ చేయవచ్చని ట్విట్ చేశారు. దీనికి సంబంధించి ఓ ఫాంను నింపి.. నిబంధనలతో కోవిడ్ టీకాను పొందవచ్చని తెలిపారు. ఈ ఖర్చును జీజీఎఫ్ భరిస్తుంది.. జై హింద్ అంటూ గౌతమ్ గంభీర్ ట్విట్ చేశారు.
ఢిల్లీలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో గౌతమ్ గంభీర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫాబీఫ్లూ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం జులై 29వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: