Viral Video: సూపర్ కిడ్.. రెండున్నరేళ్ల ఈ బాలిక తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా

Viral Video: కొంతమంది పిల్లలు వయసుతో సంబంధం లేకుండా తమ తెలివి తేటలతో ఆశ్చర్య పరుస్తుంటారు. అలాంటి ఓ చిన్నారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో..

Viral Video: సూపర్ కిడ్.. రెండున్నరేళ్ల ఈ బాలిక తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా
Super Kid
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2021 | 7:50 PM

Viral Video: కొంతమంది పిల్లలు వయసుతో సంబంధం లేకుండా తమ తెలివి తేటలతో ఆశ్చర్య పరుస్తుంటారు. అలాంటి ఓ చిన్నారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రెండున్నరేళ్ల ఈ చిన్నారి చూపించే ప్రతిభకు జ్ఞాపక శక్తికి నెటిజన్లు ఫిదా.. ఈ బాలిక అసాధారణ తెలివితేటలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిన్నారి వీడియో ఛత్తీస్ గడ్ కు చెందిన ఐఎఎస్ అధికారి డాక్టర్ ప్రియాంక శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 88 సెకన్ల వీడియో ఆమె సహోద్యోగి ప్రదీప్ తాండన్ కుమార్తె ప్రణిన అని ఈ చిన్నారి గురించి తెలుపుతూ ఆ వీడియో కి ఓ కామెంట్ జతచేశారు ప్రియాంక.

వీడియోలో, ప్రణిన అమాయకత్వం తో ముద్దు ముద్దు మాటలతో తన తెలివితేటలను ప్రదర్సించే విధానం కు నెటిజన్లు ఫిదాయ్యారు. ఈ చిన్నారి 250కు పైగా దేశాల రాజధానుల అడిగిన వెంటనే ఠక్కున సమాధానం ఇస్తుంది. ఈ రెండున్నర సంవత్సరాల అమ్మాయికి 205 కి పైగా దేశాల రాజధానులు తెలుసునని వీడియో కి క్యాప్షన్ ద్వారా ఐఏఎస్ అధికారి ప్రియాంక చెప్పారు.

Also Read: హిస్టరీలో మిస్టరీగా మిగిలిన కోట.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో.. ఇప్పటికీ రాణి పద్మావతి గజ్జెల చప్పుళ్లు