ఇన్ఫ్రా రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వెబ్‌నార్.. సాయంత్రం 4గం. ప్రసంగించనున్న ప్రధాని మోడీ
భారత దేశం అభివృద్ధి చెందాలంటే దేశీయ ఇన్ఫ్రా రంగం వేగంగా ఎదగాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. అంతేకాదు ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో...
PM Modi Addressing India at 4 PM: భారత దేశం అభివృద్ధి చెందాలంటే దేశీయ ఇన్ఫ్రా రంగం వేగంగా ఎదగాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. అంతేకాదు మౌలిక సదుపాయాల రంగంలో వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగంలో కేంద్ర బడ్జెట్ 2021-22 ను సమర్థవంతంగా అమలు చేయడానికి రోడ్‌మ్యాప్ ను రూపొందించాడానికి సలహాలు సంప్రదింపుల కోసం వెబ్‌నార్ ను నిర్వహించడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ప్రారంభంకానున్నది. ప్రధాన ఆర్థిక సంస్థలు, నిధుల ప్రతినిధులు, రాయితీలు అండ్ కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్స్ మరియు ఆర్ధిక నిపుణులతో సహా 200 మందికి పైగా ప్యానెలిస్టుల భాగస్వామ్యాన్ని వెబ్‌నార్ చూస్తుందని పిఎంఓ తెలిపింది.
ఈ వెబ్ నార్ లోని వ్యక్తులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టడంతో పాటు… ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించవచ్చునో చూస్తారని తెలిపింది. అంతేకాదు.. మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక విషయాలను ప్యానెలిస్టులు తమ ఆలోచనలను పంచుకుంటారని ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పింది.
Also Read: