Omicron: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు.. ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ ప్రకంపనలతో ప్రపంచం వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి.

Omicron:   ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు  ప్రత్యేక బృందాలు.. ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ..
Pm Modi
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2021 | 10:33 PM

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ ప్రకంపనలతో ప్రపంచం వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలోనూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 400 మార్కుకు చేరువవుతున్నాయి.    ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, కేరళలో ఒమిక్రాన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో దేశ కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారంఅధికారులతో సమావేశమయ్యారు. హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు హాజరయ్యారు.. దేశంలోని పరిస్థితి, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని సూచించారు మోదీ.టెస్టుల ‌ సంఖ్యను పెంచడంతోపాటు.. కాంటాక్ట్‌లను ట్రేసింగ్‌ చేయాలని చెప్పారు.. అత్యధిక కేసులున్న రాష్ట్రాలకు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపుతామన్నారు ప్రధాని మోదీ. ఒమిక్రాన్ నియంత్రణకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు  క్లస్టర్లు ఏర్పాటుచేసి కొత్త వేరియంట్ ను  నియంత్రించాలని ప్రధాని అధికారులకు సూచించారు.

రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు..

కాగా ఒమిక్రాన్  ప్రకంపనల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే  అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.. పండుగల సందర్భంగా ఆంక్షలు విధించాలని సూచించింది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని ఆదేశించింది. కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లను గుర్తించడంతోపాటు.. వ్యాక్సినేషన్‌నూ త్వరగా పూర్తిచేయాలి పేర్కొంది. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ ఇవ్వాలంటూ కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతండటంతో మధ్యప్రదేశ్‌లో ఆంక్షలు విధించారు..నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు మహారాష్ట్ర కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులో మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు CM ఉద్దవ్‌ థాకరే. ఇక ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధించారు..గుజరాత్‌లో 9 నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంది..కర్నాటకలోనూ సామూహిక వేడుకలు రద్దుచేశారు.. యూపీలో ఈనెల 31వరకు 144 సెక్షన్‌ పెట్టారు.. కేరళలోనూ పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో కొత్తగా  65  ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రాలలో గరిష్టంగా 64 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 24, రాజస్థాన్‌లో 21, కర్ణాటకలో 19 కేసులు నమోదయ్యాయి.