Petrol, Diesel Prices: చమురు ధరలకు బ్రేక్.. నేడు స్థిరంగానే పెట్రో, డీజిల్ ధరలు..
దేశంలో కొద్ది రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో నిత్యం పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంధన ధరలకు
Petrol, Diesel Prices: దేశంలో కొద్ది రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో నిత్యం పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంధన ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు నిలకడగానే నమోదయ్యాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
తాజాగా ఐఓసీ ప్రకటించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.89.77, డీజిల్ ధర రూ.83.46గా ఉంది. వరంగల్‌లో మాత్రంలో ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా పెట్రోల్ ధర 23పైసలు పెరిగి 89.55 కి చేరగా.. డీజిల్ 21పైసలు పెరిగి 83.24కి చేరింది.
అమరావతిలో పెట్రోల్ ధర రూ.92.54 ఉండగా.. డీజిల్ ధర రూ.85.29 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఇదిలాఉంటే… దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.86.30, డీజిల్ ధర రూ.76.48 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ.92.86, డీజిల్ ధర రూ.83.30 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 88.82 ఉండగా.. డీజిల్ ధర రూ. 81.71 గా ఉంది.
తొలిసారిగా రూ.100 మార్క్ దాటిన పెట్రోల్.. దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర తొలిసారిగా వంద మార్క్ దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.101.15కు పెరిగింది.