Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex Down : బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ల నేల చూపులు.. మరోసారి భారీగా పడిపోయిన సెన్సెక్స్..

కేంద్ర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా లేని పరిస్థితులు, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లపై పడింది.

Sensex Down : బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్ల నేల చూపులు.. మరోసారి భారీగా పడిపోయిన సెన్సెక్స్..
స్టాక్ మార్కెట్లు
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 28, 2021 | 1:24 PM

Sensex Down : కేంద్ర బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా లేని పరిస్థితులు, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లపై పడింది. రెండు రోజుల నుంచి మార్కెట్ నష్టాలతోనే ముగుస్తోంది. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఒక దశలో 500 పాయింట్లకు పైగా పడిపోయింది. తర్వాత కోలుకున్నా నష్టాల్లోనే కొనసాగుతోంది. చమురు, గ్యాస్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కనిపిస్తున్నాయి.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు నిఫ్టీ నిన్న ఒక్క రోజే 2 శాతం నష్టపోయాయి. మార్కెట్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా షేర్లను అమ్ముతున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు కూడా ఇదే ట్రెండ్ ని నమ్ముకున్నారు. నిన్న ఒక్క రోజు లోనే స్టాక్ మార్కెట్ల నుంచి 19 వందల కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. వాల్ స్ట్రీట్‌లో పరిస్థితి దలాల్ స్ట్రీట్‌కు పోటీగా ఉంది. అమెరికన్ మార్కెట్లలోనూ మూడు నెలల్లోనే అతి పెద్ద పతనం నమోదైంది. అమెరికన్ కేంద్ర బ్యాంక్ తాజా ఆర్థిక విధాన ప్రకటన అమెరికన్ మార్కెట్లను కుంగ దీసింది.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ నెల 21న 50వేల పాయింట్లు దాటింది. 11 సెషన్లలో ట్రేడింగ్ జోరుగా సాగడంతో మార్కెట్‌లలో జోష్ పెరిగింది. 32 సెషన్లలోనే మార్కెట్ 5వేల పాయింట్లు లాభపడింది. BSE 50వేల పాయింట్లు దాటిన తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ లో పతనం ప్రారంభమైంది. గతేడాది లాక్ డౌన్ తర్వాత ఒక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ 27వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులతో త్వరగా కోలుకుంది.

మార్కెట్లలో ప్రస్తుతం కరెక్షన్ జరుగుతోందని.. షేర్లు కొనాలని భావించేవారు కొంత కాలం వేచి చూడటం మంచిదని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్ మార్కెట్లు ఆల్‌ టైమ్ హై ని తాకిన తర్వాత… పడిపోవడం సాధారణ వ్యవహారమే అని… బీఎస్ఈ 45వేల వద్ద స్థిరపడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :