పాకిస్థాన్‌లో భారత సినిమాలపై వేటు!
పాకిస్తాన్ ప్రభుత్వం భారత సినిమాలపై నిషేధం విధించింది. ఈద్ సందర్భంగా పాకిస్తాన్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ గురువారం ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈద్‌కు రెండ్రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన తర్వాత రెండు వారాల వరకు భారత్ సహా విదేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించరాదని ఆదేశించింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఆగ్రహంగా ఉన్న పాక్.. భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. […]
పాకిస్తాన్ ప్రభుత్వం భారత సినిమాలపై నిషేధం విధించింది. ఈద్ సందర్భంగా పాకిస్తాన్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ గురువారం ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈద్‌కు రెండ్రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన తర్వాత రెండు వారాల వరకు భారత్ సహా విదేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించరాదని ఆదేశించింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఆగ్రహంగా ఉన్న పాక్.. భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించిన పాక్ తాజాగా, భారత సినిమాలపై నిషేధం విధించింది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ భూభాగంలోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించిన తర్వాత భారతీయ సినిమాలపై పాక్ నిషేధం విధించింది. కాగా… పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి థియేటర్ యజమానులు పెదవి విరుస్తున్నారు.