జూనియర్ డాక్టర్లకు కోదండరాం మద్దతు
జూనియర్ డాక్టర్‌ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన జూడాల మహాగర్జన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్ఎంసీ బిల్లు చట్టం కాకుండా అడ్డకున్నామని, దాన్ని మార్చాల్సిందేనని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన వైద్య విధానాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకోడానికి ప్రయత్నాల్లో భాగంగానే ఈ బిల్లు తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. […]
జూనియర్ డాక్టర్‌ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన జూడాల మహాగర్జన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్ఎంసీ బిల్లు చట్టం కాకుండా అడ్డకున్నామని, దాన్ని మార్చాల్సిందేనని కోదండరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన వైద్య విధానాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకోడానికి ప్రయత్నాల్లో భాగంగానే ఈ బిల్లు తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. జుడాల నిరసనకు సినీ నటుడు డాక్టర్ రాజశేర్ దంపతులు కూడా మద్దతుగా నిలిచారు. అర్హత లేని వారికి బ్రిడ్జ్ కోర్సు పెట్టి వారు వైద్యులుగా నియమిస్తే అందులో అర్ధం లేదని విమర్శించారు.