రాఫెల్‌ శస్త్ర పూజపై.. పాక్ ఆర్మీ ఆసక్తికర ట్వీట్..!

రాఫెల్ యుద్ధ విమానాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన శస్త్రపూజపై పాక్ ఆర్మీ కూడా స్పందించింది. ఓ వైపు దేశంలో ప్రతిపక్షాల నుంచి భిన్నస్వరాలు వస్తున్న సమయంలో.. పాక్ ఆర్మీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాఫెల్‌ యుద్ధ విమానానికి రాజ్‌నాథ్ హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు చేశారు. అయితే ఎవరి మతాచారం ప్రకారం వారు పూజలు చేయడంలో తప్పలేదని.. అంతేకాదు మత విశ్వాసాలను గౌరవించాలని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ […]

రాఫెల్‌ శస్త్ర పూజపై.. పాక్ ఆర్మీ ఆసక్తికర ట్వీట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 11, 2019 | 6:13 PM

రాఫెల్ యుద్ధ విమానాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన శస్త్రపూజపై పాక్ ఆర్మీ కూడా స్పందించింది. ఓ వైపు దేశంలో ప్రతిపక్షాల నుంచి భిన్నస్వరాలు వస్తున్న సమయంలో.. పాక్ ఆర్మీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాఫెల్‌ యుద్ధ విమానానికి రాజ్‌నాథ్ హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు చేశారు. అయితే ఎవరి మతాచారం ప్రకారం వారు పూజలు చేయడంలో తప్పలేదని.. అంతేకాదు మత విశ్వాసాలను గౌరవించాలని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో రాఫెల్‌కు ఆయుధ పూజ నిర్వహించడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

రాఫెల్‌కు ఆయుధ పూజ నిర్వహించడంలో తప్పేం లేదు. ఇది మతాచారం ప్రకారం జరిగింది.. దీనిని తప్పకుండా గౌరవించాల్సిందే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి… కేవలం మిషన్ మాత్రమే ముఖ్యం కాదు… కానీ దాన్ని నిర్వహించడంలో మనుషులు చూపించే సమర్థత, అభిరుచి, సంకల్పంలోనే ఉంది విషయమంతా. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) షహీన్స్‌ మాకు గర్వకారణం..అంటూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ ఆర్మీ ప్రతినిధి చేసిన ట్వీట్.. ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే.