గైడ్‌గా మారిన మోదీ..పంచెకట్టులో వారెవ్వా..!

ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం […]

గైడ్‌గా మారిన మోదీ..పంచెకట్టులో వారెవ్వా..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 11, 2019 | 6:07 PM

ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్‌తో చాలా సింపుల్‌గా కనిపించారు. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు పరిచయం చేశారు. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు.  ఆలయ విశిష్టత గురించి మోదీ.. జిన్‌పింగ్‌కు వివరించారు.  ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కూర్చోని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మోదీకి, జిన్‌పింగ్‌కు..అధికారులు కొబ్బరినీళ్లను ఇవ్వగా..వారు సేవించారు.