రాఫెల్‌కు పూజలు చేసింది.. అందుకోసమే..

రాఫెల్ యుద్ధ విమానం అందుకునే సమయంలో హిందూ సప్రదాయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8 విజయదశమి దసరా కావడంతో.. ఆ రోజు శస్త్రపూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌లో శస్త్ర పూజ చేయడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే రాఫెల్‌కు ఆయుధ పూజలు చేయడాన్ని డ్రామాగా అభివర్ణించారు. బోఫోర్స్‌ గన్స్‌ కొనుగోలు సమయంలోనూ కాంగ్రెస్‌ […]

రాఫెల్‌కు పూజలు చేసింది.. అందుకోసమే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 11, 2019 | 5:38 PM

రాఫెల్ యుద్ధ విమానం అందుకునే సమయంలో హిందూ సప్రదాయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8 విజయదశమి దసరా కావడంతో.. ఆ రోజు శస్త్రపూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌లో శస్త్ర పూజ చేయడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే రాఫెల్‌కు ఆయుధ పూజలు చేయడాన్ని డ్రామాగా అభివర్ణించారు. బోఫోర్స్‌ గన్స్‌ కొనుగోలు సమయంలోనూ కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇలా చేయలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గురువారం భారత్‌కు చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్.. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. ఆచారాలు, సంప్రదాయాలపై తనకు చిన్నప్పటి నుంచి విశ్వాసం ఉందని.. ఆ విశ్వాసం వల్లే రాఫెల్‌ యుద్ధ విమానాలు స్వీకరించిన సమయంలో శస్త్ర పూజ నిర్వహించానని తెలిపారు. తాను చేసింది తప్పేమీ కాదని.. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. మత విశ్వాసాల ప్రకారం పూజలు చేసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలపై కాంగ్రెస్‌లోనూ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాఫెల్‌లో ప్రయాణించిన అనుభూతిని పంచుకున్నారు. గంటకు 1300కి.మీ వేగంతో యుద్ధ విమానంలో విహరించానని తెలిపారు. ఈ యుద్ధ విమానం గంటకు 1800కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం గలదని తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలలో ఏడు విమానాలు భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు.