బ్రేకింగ్: దివ్యదర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు రద్దు..!

వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. రద్దీతో దివ్యదర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 13 వరకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని నిలిపివేశామన్నారు.  శ్రీవారికి విరాళంగా కార్లు: తిరుమల శ్రీవారికి రూ.70 లక్షల విలువైన రెండు కార్లను తితిదే ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కూపేందర్‌ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మహేంద్ర అల్టూరస్‌ […]

బ్రేకింగ్:  దివ్యదర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు రద్దు..!
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Oct 11, 2019 | 5:21 PM

వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. రద్దీతో దివ్యదర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 13 వరకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని నిలిపివేశామన్నారు.

 శ్రీవారికి విరాళంగా కార్లు:

తిరుమల శ్రీవారికి రూ.70 లక్షల విలువైన రెండు కార్లను తితిదే ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కూపేందర్‌ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మహేంద్ర అల్టూరస్‌ జీ4 మోడల్‌ కార్లకు శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి వాహనాలకు సంబ్బందించిన పత్రాలను అందజేశారు.