ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముస్లిం నేతల భేటీ
అఖిల భారత ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ముస్లిం నాయకుల ప్రతినిదుల బృందం బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ 30 మంది ముస్లిం నాయకులతో కూడిన ప్రతినిధి బృందం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ను రూపొందించడానికి కేంద్రం ఎన్‌పిఆర్‌ను ఉపయోగించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. టిఆర్ఎస్ తో […]

అఖిల భారత ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో ముస్లిం నాయకుల ప్రతినిదుల బృందం బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ 30 మంది ముస్లిం నాయకులతో కూడిన ప్రతినిధి బృందం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ను రూపొందించడానికి కేంద్రం ఎన్‌పిఆర్‌ను ఉపయోగించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెల 27న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో పాటు కలిసివచ్చే పార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తున్నామని అయన తెలిపారు. నిజామాబాద్ సభలో పాల్గొనాల్సిందిగా టిఆర్ఎస్ మంత్రులకు మా ముందే ముఖ్యమంత్రి చెప్పారని, ఎన్నార్సీ పై రెండు రోజుల్లో టిఆర్ఎస్ వైఖరి ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్‌పిఎ కి ఎన్నార్సీకి పెద్ద తేడా లేదు… ఎన్నార్సీ అమలు చేయడానికి ఎన్‌పిఎ ని మొదటి స్టెప్ గా వాడుతున్నారని, దేశ వ్యాప్తం కలిసి వచ్చే పార్టీలతో ఆందోళన కొనసాగిస్తామని ఓవైసీ స్పష్టంచేశారు. జనాభా లెక్కలకు ఎన్‌పిఎ లెక్కలకు తేడా ఉందని, జనాభా లెక్కల్లో పుట్టిన ప్రదేశము తల్లిదండ్రుల వివరాలు అడగరు.. కానీ ఎన్‌పిఎ లో పౌరసత్వ వివరాలు అడుగుతున్నారని ఒవైసీ వివరించారు.



