Bus Accident: వలస కూలీలతో వెళుతున్న బస్సు బోల్తా… ముగ్గురు మృతి, పలువురికి గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం
ఢిల్లీ నుంచి టీమాగఢ్ వెళుతున్న ఒక బస్సు జోరసీ ఘాటీ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి. 8 మందికి తీవ్ర గాయాలు.
Uncontrolled Bus Accident: వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి టీమాగఢ్ వెళుతున్న ఒక బస్సు జోరసీ ఘాటీ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక బృందాల సాయంతో క్షతగాత్రులను గ్వాలియర్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న భయంతో వలస కూలీలంతా ఢిల్లీ నుంచి ఛతర్‌పూర్, టీమాగఢ్ జిల్లాలలోని తమ సొంతూళ్లకు తరలివెళుతున్నారు. ఇదే క్రమంలో జోరసీ ఘాటీ ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం డ్రైవర్ అత్యంత వేగంగా బస్సును నడపడంతో, అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, బోల్తా పడింది. వెంటనే బస్సులోని ప్రయాణికులు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న బిలౌవా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును సరిచేసి, ప్రయాణికులన ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చారు. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు అతివేగం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.