నెల రోజుల్లో మోదీ..మాజీ కాబోతున్నారు

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలో మాజీ కావడం ఖాయమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెలరోజుల తర్వాత మాజీ ప్రధాని అవుతారని చెప్పుకొచ్చారు. మరోవైపు సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్‌ను భోపాల్ నుంచి ఎన్నికల బరిలోకి దించడంపై ఒవైసీ మండిపడ్డారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రగ్యాసింగ్‌ను ఎన్నికల్లో పోటీకి […]

నెల రోజుల్లో మోదీ..మాజీ కాబోతున్నారు
Follow us

|

Updated on: Apr 20, 2019 | 12:55 PM

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలో మాజీ కావడం ఖాయమని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెలరోజుల తర్వాత మాజీ ప్రధాని అవుతారని చెప్పుకొచ్చారు. మరోవైపు సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్‌ను భోపాల్ నుంచి ఎన్నికల బరిలోకి దించడంపై ఒవైసీ మండిపడ్డారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రగ్యాసింగ్‌ను ఎన్నికల్లో పోటీకి పెట్టడమేంటని ప్రశ్నించారు. ఐపీఎస్  అధికారి హేమంత్ కర్కరేపై ఆమె చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశ భద్రత, ఉగ్రవాదం నిరోధం గురించి ప్రధాని మోదీ ఉపన్యాసాలు చెబుతారు.. కానీ, మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలిగొన్న కేసులో నిందితురాలైన ప్రగ్యాకు బీజేపీ టికెట్ ఎలా ఇచ్చారని మండిపడ్డారు. ఉగ్రవాద దాడి కేసులో నిందితురాలికి టికెట్ ఇవ్వడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించడమా? అని ఎద్దేవా చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

Latest Articles