AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 ఏళ్ల నాటి హత్య కేసులో.. బీజేపీ ఎమ్మెల్యేకి యావజ్జీవం

లక్నో : ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయనతో పాటు మరో 9 మందికి కూడా ఇదే శిక్షను విధిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 22 ఏళ్ల క్రితం ఐదుగురు కుటుంబసభ్యులను హతమార్చిన కేసులో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా అశోక్ సింగ్ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని.. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ప్రస్తుతం అశోక్ సింగ్ హమీర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా […]

22 ఏళ్ల నాటి హత్య కేసులో.. బీజేపీ ఎమ్మెల్యేకి యావజ్జీవం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 12:31 PM

Share

లక్నో : ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయనతో పాటు మరో 9 మందికి కూడా ఇదే శిక్షను విధిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. 22 ఏళ్ల క్రితం ఐదుగురు కుటుంబసభ్యులను హతమార్చిన కేసులో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా అశోక్ సింగ్ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని.. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ప్రస్తుతం అశోక్ సింగ్ హమీర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు.