లైంగిక ఆరోపణలు: లిస్ట్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులపై లైంగిక ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార తేడా లేకుండా ప్రతి రంగంలోనూ పేరు మోసిన ఘనులు ఎంతోమంది ఈ ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ మధ్య ‘మీటూ’ పేరుతో వచ్చిన  ఉద్యమంలో ఇప్పటికే చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాగా తాజాగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గొగోయ్ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా […]

లైంగిక ఆరోపణలు: లిస్ట్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులపై లైంగిక ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార తేడా లేకుండా ప్రతి రంగంలోనూ పేరు మోసిన ఘనులు ఎంతోమంది ఈ ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ మధ్య ‘మీటూ’ పేరుతో వచ్చిన  ఉద్యమంలో ఇప్పటికే చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాగా తాజాగా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గొగోయ్ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళ ఆరోపించారు. తన నివాస కార్యాలయంలో గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22మంది జడ్జిలకు లేఖ రాశారు.

‘‘ఈ వేధింపులు 2018, అక్టోబర్ 10-11 తేదీల్లో చోటుచేసుకున్నాయి. రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుము చుట్టు చేయివేసి గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. నన్ను కూడా కౌగిలించుకోమన్నారు. అయితే వెంటనే ఆయన నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఇది జరిగిన 2 నెలలకే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అనుమతి లేకుండా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు నన్ను సర్వీసు నుంచి తొలగించామని చెప్పారు. ఈ వేధింపులు అక్కడితో ఆగిపోలేదు. నా భర్త, నా బావ ఢిల్లీ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని 2012లో జరిగిన ఓ కాలనీ వివాదంలో గతేడాది డిసెంబర్ 28న సస్పెండ్ చేశారు.

నేను నా భర్తతో కలిసి రాజస్థాన్‌లో ఉండగా.. ఓ చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నేను సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి 50వేలు తీసుకున్నట్లు తప్పుడు ఫిర్యాదు చేయించారు. మా ఇద్దరిని మాత్రమే కాకుండా మా బావ కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని అవమానించారు. 24 గంటల పాటు కనీసం నీళ్లు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి, దూషించడంతో పాటు భౌతికంగా దాడి చేశారు. నేను క్షమాపణ చెప్పాలని రంజన్ గొగోయ్ భార్య డిమాండ్ చేసింది. అయితే తాను ఎందుకు క్షమాపణ కోరుతుందో ఆమెకు కూడా తెలీదు. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా నాకు వేధింపులు ఆగలేదు. దివ్యాంగుడైన మా బావ సుప్రీంకోర్టులో తాత్కాలిక జూనియర్ అటెండెంట్‌గా గతేడాది అక్టోబర్ 9న నియమితులయ్యారు. అకారణంగా ఆయనను గొగోయ్ తప్పించారు’’ అంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అత్యున్నత్త న్యాయమూర్తి పదవిలో ఉండి తీర్పునిచ్చే వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

ఆరోపణలను ఖండించిన గొగోయ్
కాగా తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను రంజన్‌ గొగొయ్‌ ఖండించారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారమని, ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ స్వతంత్రత పెను ప్రమాదంలో పడుతుందని రంజన్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని, కానీ తాను ఎవరికీ భయపడనని ఆయన పేర్కొన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu