బ్రిటన్ లో కరోనా విజృంభణ, నెలరోజుల లాక్ డౌన్ ?

బ్రిటన్ లో కోవిడ్ 19 తిరిగి విజృంభిస్తోంది. ప్రతి రోజూ సుమారు 50 వేలమంది ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారని, గత 15 రోజుల్లో ఆస్పత్రుల్లో చేరిన  కరోనా వైరస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో నెల రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ యోచిస్తున్నారు. వచ్ఛే వారం ఈ మేరకు ఆయన ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలను రక్షించాలంటే సుదీర్ఘ లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని ఓ కమిటీ […]

బ్రిటన్ లో కరోనా విజృంభణ,   నెలరోజుల లాక్ డౌన్ ?
Umakanth Rao

| Edited By: Balu

Oct 31, 2020 | 5:51 PM

బ్రిటన్ లో కోవిడ్ 19 తిరిగి విజృంభిస్తోంది. ప్రతి రోజూ సుమారు 50 వేలమంది ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారని, గత 15 రోజుల్లో ఆస్పత్రుల్లో చేరిన  కరోనా వైరస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో నెల రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ యోచిస్తున్నారు. వచ్ఛే వారం ఈ మేరకు ఆయన ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలను రక్షించాలంటే సుదీర్ఘ లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని ఓ కమిటీ ఆయనకు సూచించింది. ఈ చర్య తీసుకోకపోతే రోజుకు దాదాపు 4 వేలమంది కరోనా రోగులు మరణించవచ్చునని, అన్ని వయసులవారినీ ఈ వైరస్ కబళించవచ్చునని  కొందరు శాస్త్రవేత్తలతో కూడిన ఆ కమిటీ హెచ్ఛరించినట్టు తెలుస్తోంది. కోవిడ్ ఇదివరకటికన్నా వేగంగా ఇప్పుడు వ్యాప్తి చెందుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు  బోరిస్ జాన్సన్ ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే టోరీ ఎంపీల్లో కొంతమంది ఈ సూచనను వ్యతిరేకిస్తున్నారు. మొదట పార్లమెంటులో దీనిపై ఓటింగ్ నిర్వహించాలన్నది వారి అభిప్రాయం, ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని, మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే మనవద్ద సొమ్ముల్లేక దీర్ఘకాలం పేదరికంలో మగ్గవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా బోరిస్ జాన్సన్ తాము తీసుకోబోయే చర్యలపై తన మంత్రివర్గ సభ్యులతో చర్చలకు దిగనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu