Milk Benefits: పడుకునే ముందు ఒక గ్లాస్ వేడిపాలు తాగితే హాయిగా నిద్రపోవచ్చట.. ఎందుకలా?
డుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి సాదారణంగా ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి రాత్రి భోజనం తర్వాత పాలు తాగమని మనకు పదే పదే చెప్పడం తెలిసిందే.
Milk Benefits: పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి సాదారణంగా ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి రాత్రి భోజనం తర్వాత ‘పసుపు పాలు ‘ లేదా ‘బాదం పాలు’ తాగమని బలవంతం చేయడం మనకు తెలిసిందే. వెచ్చని పాలు మనకు చక్కగా నిద్రపోవడానికి సహాయపడతాయని నమ్ముతారు. అలా పాలు తాగితే మంచి నిద్ర ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు అనే ప్రశ్నకు జవాబుగా కేసిన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ (CTH) అని పిలువబడే మిల్క్ పెప్టైడ్‌ల మిశ్రమం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను మరింత ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాదు. అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఒక నివేదిక సీటీహెచ్ లో కొన్ని నిర్దిష్ట పెప్టైడ్‌లను గుర్తించింది.
ANI లో ఒక నివేదిక ప్రకారం, శాస్త్రవేత్తలు “అనేక సహజ పెప్టైడ్‌లు లేదా చిన్న ప్రోటీన్ ముక్కలను కూడా కనిపెట్టారు. అవి ఆందోళన, నిద్రను పెంచే ప్రభావాలను కలిగి ఉంటాయి”. పరిశోధకులు ఎల్ జెంగ్, మౌమింగ్ జావో వారి సహోద్యోగులు, దీనిపై పనిచేస్తున్నారు. సిటీహెచ్ లో నిద్రను పెంచే ఇతర (బహుశా మరింత శక్తివంతమైన) పెప్టైడ్‌లు ఉండవచ్చని భావిస్తున్నారు. పరిశోధన ఎలుకల మీద నిర్వహించారు. ఈ పరిశోధనలో సిటీహెచ్ మెరుగైన నిద్రను పెంచే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. బలమైన పెప్టైడ్‌లను ఎలుకలలో పరీక్షించినప్పుడు, అవి త్వరగా నిద్రపోయే ఎలుకల సంఖ్యను 25 శాతం పెంచాయి. అంతేకాకుండా, నియంత్రణ సమూహంతో పోలిస్తే నిద్ర వ్యవధి 400 శాతానికి పైగా పెరిగింది. ఏదేమైనా, పరిశోధకులు ఈ మంచి పెప్టైడ్‌తో పాటు, ఇతర మార్గాల ద్వారా నిద్రను పెంచే సిటీహెచ్ లోని ఇతర కారకాలను అన్వేషించాలని సూచించారు.
దీనిని పరిగణనలోకి తీసుకుంటే, మన మనస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు గాఢ నిద్ర కోసం మన డిన్నర్ తరువాత వెచ్చని గ్లాసు పాలను చేర్చడం మంచిది అనిపిస్తోంది. కానీ ఎప్పుడైనా మన డైట్ మార్చాలని అనుకున్నపుడు మన ఇంటి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి: IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Maa Elections 2021: మా ఎన్నికలల్లో మరో ట్విస్ట్.. బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు.. అసలేం జరుగుతోంది.