Maa Elections 2021: మా ఎన్నికలల్లో మరో ట్విస్ట్.. బాలకృష్ణ ఇంటికి మంచు విష్ణు, మోహన్ బాబు.. అసలేం జరుగుతోంది.
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో..

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకరణం చేసిన విష్ణు.. తొలిసారి నట సింహం బాలకృష్ణను కలుసుకున్నారు.
మా ఎన్నికలకు ముందు మద్ధతు కోసం వెళ్లిన విష్ణు ఎన్నికల ఫలితం అనంతరం వెళ్లి తనకు మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్యతో ఓ ఫోటో కూడా దిగారు. ఆత్మీయులందరినీ కలుసుకునే క్రమంలో బాలయ్య ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అయితే విష్ణు, బాలయ్యల మధ్య రాజీనామాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందించారో తెలియాల్సి ఉంది. ఇదలా ఉంటే విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా బాలకృష్ణను కలవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య బాబును కలిసిన తర్వాత బయటకు వచ్చిన మోహన్ బాబు మాట్లాడుతూ.. బాలకృష్ణ హుందా తనంతో విష్ణుకు మద్ధతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చామని చెప్పుకొచ్చారు. ఇక విష్ణు మాట్లాడుతూ తనకు అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు.
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలనే ఆసక్తితో ఉన్న విష్ణు ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేశారు. ఇందులో భాగంగానే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విష్ణు తన తొలి సంతకాన్ని పెన్షన్ ఫైల్‌పై చేశారు. అలాగే వంద రోజుల కార్యచరణ పెట్టుకున్న విష్ణు ఇందులో భాగంగా మా బిల్డింగ్ నిర్మాణానికి ప్లేస్‌ను ఫైనల్ చేయడం, హెల్త్ ఇన్సురెన్స్‌లపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Viral Video: పెళ్లి స్టేజ్ పైనే వరుడికి వధువు వార్ణింగ్.. వీడియో