IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) పలు అప్రెంటిస్‌ ఖాళీల భర్తకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐఓసీఎల్‌ సంస్థకు చెందిన పైప్‌లైన్‌ డివిజన్‌లో ఉన్న ఖాళీలను..

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Iocl Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 14, 2021 | 11:50 AM

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) పలు అప్రెంటిస్‌ ఖాళీల భర్తకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐఓసీఎల్‌ సంస్థకు చెందిన పైప్‌లైన్‌ డివిజన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 469 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెకానికల్, ఎలక్ట్రికల్, హ్యూమన్‌ రిసోర్స్, డేటాఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు వివిధ ట్రేడులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఫుల్‌టైం బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థలు వయసు 01.10.2021 నాటికి 18–24ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థునుల రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 25.10.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Hyderabad: పీకలదాకా తాగారు.. ఆపై బిల్లు కట్టమంటే ‘నై’ అన్నారు.. చివరికి ఏం జరిగిందంటే..

viral video: లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి.. వీడియో

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..