AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ప్రభావం తక్కువట..!

ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికి మాత్రం కరోనా వైరస్ సోకే లక్షణాలు తక్కువంటోంది 23 అండ్‌ మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ.

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ప్రభావం తక్కువట..!
Balaraju Goud
|

Updated on: Jun 10, 2020 | 8:48 PM

Share

రోనా మహమ్మారి ప్రపంచాన్నే శాసిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనా ఇప్పటి వరకు ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి. ఇంకా ట్రయల్స్ జరుగుతున్నప్పటికీ.. ఖచ్చితమైన సమయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికి మాత్రం కరోనా వైరస్ సోకే లక్షణాలు తక్కువంటోంది 23 అండ్‌ మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకినప్పటికి అనేక మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. దీనిపై అమెరికాకు చెందిన 23 అండ్‌మీ అనే జెనెటిక్ టెస్టింగ్‌ సంస్థ అధ్యయనం జరుపుతోంది. జన్యు శాస్త్రానికి సంబంధించిన ఈ అధ్యయనం ఇంకా పూర్తి కానప్పటికి.. ప్రిలిమినరీ ఫలితాల్లో ఒక విషయాన్ని గుర్తించనట్లు సంస్థ చెబుతోంది. కరోనా బారిన పడుతున్న వారిలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు తక్కువగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. మిగతా బ్లడ్ గ్రూప్‌లతో పోల్చితే ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది కరోనా బారిన పడుతున్నారని సంస్థ వివరించింది. దాదాపు 8 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందన్నారు. అయితే తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.. ఇవి కేవలం ప్రారంభస్థాయిలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు మార్చి నెలలో జరిపిన పరిశోధనలోనూ సరిగ్గా ఇలాంటి ఫలితాలే వచ్చాయని తెలిపింది. ఈ అధ్యయనంలో టైప్ ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో కరోనా బారిన పడితే.. టైప్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తెలిసింది. కానీ, దీనిపై స్పష్టమైనా అధారాలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.

స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?