Omicron Scare: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ మాస్క్ లేకపోతే ఫైన్.. వ్యాక్సినేషన్ లేకుంటే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో నో ఎంట్రీ

Omicron Variant Scare: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశంలో మళ్ళీ కొత్త వేరియంట్ టెన్షన్ మొదలయ్యింది. దేశంలోనే ఒమిక్రాన్ వేరియంట్ కర్ణాటకలో..

Omicron Scare: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ మాస్క్ లేకపోతే ఫైన్.. వ్యాక్సినేషన్ లేకుంటే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో నో ఎంట్రీ
Karnataka Omicron Variant
Follow us

|

Updated on: Dec 04, 2021 | 8:08 AM

Omicron Variant Scare: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశంలో మళ్ళీ కొత్త వేరియంట్ టెన్షన్ మొదలయ్యింది. దేశంలోనే ఒమిక్రాన్ వేరియంట్ కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగించిన కొత్త వేరియంట్‌పై.. రాష్ట్రంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటక సర్కార్ అప్రమత్తమయ్యింది.  కర్ణాటకలో ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అధికార యంత్రం అలెర్ట్ అయింది. యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోవాలని సూచించింది. అంతేకాదు వ్యాక్సిన్  రెండు డోసులను తీసుకున్నవారిని మాత్రమే సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, పార్కులలోకి అనుమతించాలని సూచించింది.

అంతేకాదు తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటేనే విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకొని తల్లిదండ్రుల పిల్లలను పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతులకు అనుమతినివ్వమని చెప్పారు. అంతేకాదు జనవరి 15, 2022 వరకు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను వాయిదా వేయాలని స్కూల్స్, కాలేజీలకు సూచించారు. మరోవైపు అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు పగడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులను కోవిడ్ టెస్టులు నిర్వహించి.. రిజల్ట్ వచ్చిన అనంతరం మాత్రమే ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. రోజుకి కరోనా టెస్టులను ఎక్కువగా చేసేలా చర్యలు చేపట్టారు.

కరోనా నిబంధాల్లో భాగంగా మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికీ ఫైన్ విధించేలా అధికారులు చర్యలు మొదలు పెట్టారు.  మాస్క్ లేని వారికీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 250, ఇతర ప్రాంతాల్లో రూ. 100 జరిమానా విధించనున్నారు. మరోసారి కోవిడ్ పేషేంట్స్ కోసం ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఓ వైపు ఇప్పటికే ఆక్సిజన్‌ ​​ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. మెడిసిన్స్ కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వ్యాక్సిన్లు, ఔషధాలను ముందుగానే కొనుగోలు చేస్తామని వైద్య అధికారులు తెలిపారు.  కొత్త వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

Also Read: జలప్రళయంతో రాజకీయాలు మానండి.. టీడీపీ స్క్రిప్ట్ కేంద్ర మంత్రి చదివారంటున్న మంత్రి అనిల్