Kangana Ranaut: కాంట్రవర్సల్‌ కథానాయికకు షాక్‌.. నడిరోడ్డుపై అడ్డగించిన రైతులు

కాంట్రవర్సల్‌ కథానాయికకు షాక్‌ తగింలింది. ఆ హీరోయిన్ చేసిన కామెంట్లపై ఫైర్‌ అయ్యారు రైతులు. దీంతో ఖంగుతింది కంగనా.

Kangana Ranaut: కాంట్రవర్సల్‌ కథానాయికకు షాక్‌.. నడిరోడ్డుపై అడ్డగించిన రైతులు
Kangana Ranaut
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 04, 2021 | 7:53 AM

ప్రముఖ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​కు పంజాబ్​లో చేదు అనుభవం ఎదురైంది. రోపార్​లో ఆమె కారును అడ్డగించారు అన్నదాతలు. రైతు నిరసనలపై ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నదాతలు. ఈ ఘటనపై స్పందించారు కంగన. ఆ సమయంలో పోలీసులు లేకపోయుంటే.. తనపై మూక దాడి జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారామె. తన కారును అడ్డగించిన వారు సిగ్గుపడాలని ఫైర్‌ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నటి కంగనా రౌనత్, ఇటీవల మరో వివాదంలో చిక్కుకుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్, రైతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి చిక్కులు తెచ్చుకుంది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదినట్లు, బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కంగన. ఇలాంటి వారికీ అలాంటి గురువు కావాలంటూ రాసుకొచ్చారామె. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కంగన రనౌత్. రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్ స్ట్రాగ్రామ్‌లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. కంగనా కామెంట్స్ సిక్కుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్కు మతస్థులు ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రోపార్​లో ఆమె కారును అడ్డగించారు రైతులు. కంగన గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు మహిళా రైతులు. రైతు ఉద్యమంపై చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!