ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్..రంగంలోకి దిగిన ఈడీ అధికారులు..11 వందలకోట్లు కాజేసిన చైనా కంపెనీలపై కేసు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక నిందితుడిని పట్టుకున్నారు ఈడీ అధికారులు. నైసర్‌ కొఠారి అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. 1100 కోట్ల ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో ఆరా తీస్తున్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 7:17 am, Sat, 12 December 20
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో మరో ట్విస్ట్..రంగంలోకి దిగిన ఈడీ అధికారులు..11 వందలకోట్లు కాజేసిన చైనా కంపెనీలపై కేసు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక నిందితుడిని పట్టుకున్నారు ఈడీ అధికారులు. నైసర్‌ కొఠారి అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. 1100 కోట్ల ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో ఆరా తీస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో నైసర్‌ కొఠారిని అరెస్ట్‌ చేశారు ఈడీ అధికారులు. మనీ ల్యాండరింగ్‌తో పాటు ఇప్పటికే హవాలా కేసులు నమోదు చేశారు.

మొదట ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందాను వెలుగులోకి తీసుకొచ్చారు హైదరాబాద్‌ పోలీసులు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో గేమింగ్‌పై ఎన్ఐఏ  నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై సిటీ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఆ తర్వాత ఈడీ సైతం రంగంలోకి దిగింది. 11 వందలకోట్ల రూపాయలను అక్రమంగా దేశప్రజల నుంచి కాజేసిన చైనా కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అంతేకాదు హైదరాబద్‌ కేంద్రంగా బయటపడ్డ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌పై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది.

ఆన్‌లైన్‌లో చైనా కంపెనీలు పెద్దయెత్తున బెట్టింగ్‌ నిర్వహించాయి. ప్రధానంగా కలర్‌ ప్రొటెక్షన్‌ పేరుతో ఈ గేమ్స్‌ ఏర్పాటు చేశారు. ముందుగా చిన్న మొత్తంలో డబ్బులు కట్టించుకుని…ఆ తర్వాత పెద్దమొత్తంలో డబ్బులు కొల్లగొట్టారు. దాదాపు 11 వందల కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లోనే చైనాకి బదిలీ చేసినట్టుగా విచారణలో తేలింది.

ఇండియాలో ఉన్న పలు కంపెనీల పేర్ల మీద డబ్బుల్ని అక్రమంగా చైనాకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర సర్కార్‌ సీరియస్‌గా దృష్టిపెట్టడంతో ఈడీతో పాటు ఎన్‌ఐఏను రంగంలోకి దించింది. హైదరాబాద్‌ పోలీసుల నుంచి ఈడీ వివరాలు సేకరించింది. తాజాగా ఈ కేసులో నైసర్‌ కొఠారి అనే కీలక నిందితుడు అరెస్ట్‌ కావడంతో మిగతా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు ఈడీ అధికారులు.