వెయ్యి రూపాయలకే దహన సంస్కారాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి రూపాయలకే దహన సంస్కారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల రూపా యి చెల్లిస్తే అంతిమ యాత్ర నిర్వహిస్తామని కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన స్పూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకమండలి అధికారులు చెబుతున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు అతని సంబంధీకులు వెయ్యి రూపాయలు చెల్లిస్తే పంచాయతీ పాలక వర్గం తరపున రూ.5 వేలు, […]
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి రూపాయలకే దహన సంస్కారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల రూపా యి చెల్లిస్తే అంతిమ యాత్ర నిర్వహిస్తామని కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన స్పూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకమండలి అధికారులు చెబుతున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు అతని సంబంధీకులు వెయ్యి రూపాయలు చెల్లిస్తే పంచాయతీ పాలక వర్గం తరపున రూ.5 వేలు, సర్పంచ్ సొంతంగా రూ.2వేలు కలిపి దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ తెలిపారు.