ఎన్టీఆర్ ట్రాఫిక్ ఫైన్ కట్టిన అభిమాని.. అందుకు రిటర్న్ గిఫ్ట్ ఏం అడిగాడో తెలిస్తే షాక్ అవడం పక్కా..

జూనియర్ ఎన్టీఆర్‏కు అటు సినిమా పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక

  • Rajitha Chanti
  • Publish Date - 7:15 pm, Fri, 22 January 21
ఎన్టీఆర్ ట్రాఫిక్ ఫైన్ కట్టిన అభిమాని.. అందుకు రిటర్న్ గిఫ్ట్ ఏం అడిగాడో తెలిస్తే షాక్ అవడం పక్కా..

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు అటు సినిమా పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే.. ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఓ అభిమాని ఎన్టీఆర్ ట్రాఫిక్ జరిమానాను ఆన్‏లైన్ ద్వారా చెల్లించాడు. అందుకు ఆ అభిమాని అడిగిన రిటర్న్ గిఫ్ట్ తెలిస్తే షాకవుతారు.

గత నెలలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్‏తో కారు నడిపినందుకు తెలంగాణ పోలీసులు ఎన్టీఆర్‏కు రూ.1035 ఫైన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆ ఫైన్ మొత్తాన్ని ఆన్‏లైన్ ద్వారా చెల్లించాడు. ఇక ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. దానికి రిటర్న్ గిఫ్ట్‏గా “తారక్ అన్నా.. నాతోపాటు నా స్నేహితులు కొంతమందికి మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించండి” అంటూ విన్నవించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‏గా మారింది.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు. అలాగే ఇందులో సీతారామరాజుగా హీరో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటి అలియాభట్, హాలీవుడ్ నటి ఓలీవియా మోరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

Also Read:

Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?