AP Government: గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం

AP Government: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటులో తెగిపోయిన రహదారుల పునర్నిర్మాణం కోసం...

  • Subhash Goud
  • Publish Date - 7:28 pm, Fri, 22 January 21
AP Government: గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం

AP Government: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటులో తెగిపోయిన రహదారుల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కాకినాడ, విజయవాడలలో ప్రభుత్వ రంగ సంస్థ భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ భూగర్భ గ్యాస్‌ పైప్‌లైన్‌ కారణంగా దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మాణ ఖర్చు భరిస్తుందని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కృష్ణా జిల్లాలో మేగా ఇంజనీరింగ్‌ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లు తెగిన రహదారులకు మరమ్మత్తులకు నిధులు సమకూరుస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఏజీ అండ్ పీ మార్కెటింగ్, అట్లాంటింక్ గల్ఫ్ పసిఫిక్ సంస్థలు గ్యాస్ పైప్ లైన్ కారణంగా దెబ్బతిన్న రోడ్ల ఖర్చు భరిస్తుందని వెల్లడించింది.

అయితే బీటీ రోడ్లకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మీటరుకు రూ. 2179 చొప్పున, సీసీ రోడ్లకు రూ. 2497 చొప్పున గ్యాస్ పైప్ లైన్ సంస్థల నుంచి వసూలు చేయనున్నట్టు తెలిపిన ప్రభుత్వం.. రహదారుల పక్కన పడిన గుంతలను పూడ్చేందుకు ఒక్కోదానికి రూ. 1839, పట్టణ ప్రాంతాల్లో రూ. 1704లను గ్రామీణ ప్రాంతాల్లో వసూలు చేయనున్నట్టు వెల్లడించింది. గ్యాస్‌ పైపు లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న సదరు సంస్థలు స్వయంగానూ ఈ మరమ్మత్తులు చేసేందుకు ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది.

Also Read: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌, అమ్మ ఒడి కింద ల్యాప్‌టాప్‌ల పంపిణీ.. ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు