AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SC rejects: సుప్రీంకోర్టుకు చేరిన ఆంధ్రప్రదేశ్ లోకల్ ‘పంచాయితీ’.. హౌజ్ మోషన్ తిరస్కరించిన కోర్టు..

హౌజ్ మోషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరుపుతామన్న తేల్చి చెప్పింది.

SC rejects: సుప్రీంకోర్టుకు చేరిన ఆంధ్రప్రదేశ్ లోకల్ ‘పంచాయితీ’..  హౌజ్ మోషన్ తిరస్కరించిన కోర్టు..
Balaraju Goud
|

Updated on: Jan 22, 2021 | 7:48 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికల కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన హౌజ్ మోషన్ తిరస్కరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు హౌజ్ మోషన్ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థలకు, పంచాయతీలకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగి తీరాల్సిందే అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లి.. నిర్వహణ మాకు కష్టం అని నివేదించుకోగానే.. ఈసీ ప్రకటించిన షెడ్యూలును హైకోర్టు రద్దు చేసింది. ఇప్పట్లో ఎన్నికలు అవసరం లేదని చెప్పింది. దాని మీద ఈసీ తక్షణమే.. బెంచ్ ఎదుట మరో పిటిషన్ వేశారు. హౌస్ మోషన్ పిటిషన్ కింద తక్షణం ఈ కేసు విచారించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తికాకుండా విధులకు హాజరుకాలేమన్న ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టుకు నివేదించారు. అలాగే రాజ్యాంగంలోని జీవించే హక్కును పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కరోనా ముప్పు కారణంగానే కోర్టులు కూడా వర్చువల్ విధానంలో జరుగుతున్నాయని పేర్కొన్న ఉద్యోగ సంఘాలు.. ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల్లో పాల్గొనలేమని తెలిపారు.

ఇదిలావుంటే, హౌజ్ మోషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరుపుతామన్న తేల్చి చెప్పింది. అసాధారణ పరిస్థితుల్లో నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉందని, సోమవారం వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also… మాజీ మంత్రి అఖిల ప్రియకు ఉపశమనం, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్