Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ

Hero Bike: కరోనా కాలంలో కూడా ద్విచక్ర వాహనాల కంపెనీలు వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు మండిపోతుండటంతో..

Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 15, 2021 | 7:46 PM

Hero Bike: కరోనా కాలంలో కూడా ద్విచక్ర వాహనాల కంపెనీలు వినియోగదారులకు ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగిపోతుండటంతో చాలా మంది అధిక మైలేజీ ఇచ్చే వాహనాల వైపే మొగ్గు చూపుతున్నార.ఈ నేపథ్యంలో హీరో కంపెనీ తక్కువ బడ్జెట్‌లో ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంతో కాలం నుంచి మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉండే హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ బైక్‌ ధర రూ.80 వేల వరకు ఉండగా, ఫైనాన్స్‌ సౌకర్యంతో చౌకగా సొంతం చేసుకోవచ్చు.

డౌన్ పేమెంట్‌, ఈఎంఐ వివరాలు:

ఈ బైక్‌ కొనుగోలు చేయాలంటే కేవలం రూ.8,000 డౌన్‌ పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆపై మీరు బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. బైక్‌ ధర మొత్తం రూ.80,491 ఉండగా, మీరు 36 నెలల పాటు ఈఎంఐ ఆప్షన్‌ను పెట్టుకోవచ్చు. అంటే మీరు డౌన్‌పేమెంట్‌ పోను మొత్తం రూ.72,491 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై మీకు రూ.9.7శాతం పడుతుంది. అంటే మీరు ఈఎంఐ పెట్టుకున్న 36 నెలల్లో మొత్తం రూ.93,600 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ రూ.21,109 ఉండగా, ఈ సమయంలో మీరు ప్రతినెలా రూ.2600 ఈఎంఐ చెల్లించాలి. మీరు 60 నెలలు పూర్తి చేస్తే ఈ సమయంలో మీరు మొత్తం రూ.1,07,640 చెల్లించాలి. ఇక్కడ వడ్డీ రూ.35,147 అవుతుంది. దీంతో మీరు ప్రతి నెలా రూ.1794 ఎంఐఎం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈఎంఐ విషయంలో ఆయా షోరూమ్‌లను బట్టి చిన్న చిన్న మార్పులుంటాయి.

బైక్‌ గురించి చెప్పాలంటే..

ఈ బైక్‌లో మంచి లుక్‌ కలిగి ఉంటుంది. ఈ హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ను భారతదేశంలో చాలా మంది ఇష్టపడేవారున్నారు. ఈ బైక్‌ 97.2సీసీ ఇంజన్‌, 8.02 పీఎస్‌ శక్తి, 8.05 ఎన్‌ఎమ్‌ టార్క్‌ ఇస్తుంది. ఈ బైక్‌ మైలేజీ 64 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ బైక్‌ మంచి సర్వీసు ఇస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ బైక్‌కు మంచి క్రేజ్‌ ఉంది.

ఇవీ కూడా చదవండి:

RBI: షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఆ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

Audi E-Tron: గుడ్‌న్యూస్‌.. ఆడి నుంచి సరికొత్త విద్యుత్‌ కారు.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం