- Telugu News Photo Gallery Business photos Audi e tron sportback confirmed for india launch on july 22
Audi E-Tron: గుడ్‌న్యూస్.. ఆడి నుంచి సరికొత్త విద్యుత్ కారు.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
Audi E-Tron: ప్రస్తుతం కార్ల తయారీ కంపెనీలు రకరకాల మోడళ్లలో కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు అన్ని మోడళ్లు ..
Updated on: Jul 14, 2021 | 5:13 PM

Audi E-Tron: ప్రస్తుతం కార్ల తయారీ కంపెనీలు రకరకాల మోడళ్లలో కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు అన్ని మోడళ్లు విడుదలవుతున్నాయి. కరోనా కాలంలో నష్టపోయిన కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు, కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే వివిధ కార్ల కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

తాజాగా జర్మనీ విలాస కార్ల దిగ్గజం ఆడి సరికొత్త విద్యుత్ కారు ఇ-ట్రాన్ మోడల్‌ను ఈ నెల 22న భారత్‌లో విడుదల చేయనుంది. రెండు బాడీ స్టైల్స్- ఆడి ఇ-ట్రాన్, ఆడి ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌ల్లో లభించనుంది. వీటితో పాటు ఆడి ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55 వెర్షన్‌లను తీసుకొస్తున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది.

ఆడి ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్.. ఇ-ట్రాన్ 55 వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకువస్తోంది. భారత విద్యుత్ కార్ల ప్రయాణాన్ని నమ్ముతున్నామని, ఇదే సమయంలో వినియోగదారులకు ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు.

ఆడి వెబ్‌సైట్‌లో లేదా సమీప షోరూమ్‌లలో కొత్త కార్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. కొనుగోలు తేదీ నుంచి మూడేళ్ల వరకు బైబ్యాక్ ఆఫర్, 8 ఏళ్ల హై-వోల్టేజ్ బ్యాటరీ వారెంటీ వంటి ప్యాకేజీలను అందిస్తోంది. 2+2, 2+3 ఏళ్ల కాల వ్యవధితో పొడిగించిన వారెంటీని ఆడి ఇస్తోంది.



