వలస కార్మికులు, యాత్రికులు సంప్రదించాల్సింది వీరినే

వలస కార్మికులు, యాత్రికులు సంప్రదించాల్సింది వీరినే

వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన చెందిన వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు ఆ రాష్ట్రానికి కేటాయించిన నోడల్ అధికారిని సంప్రదిస్తే ఆయన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

Rajesh Sharma

|

May 04, 2020 | 5:05 PM

వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన చెందిన వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు ఆ రాష్ట్రానికి కేటాయించిన నోడల్ అధికారిని సంప్రదిస్తే ఆయన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండిపోయిన వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల కోసం కృష్ణ బాబును నోడల్ అధికారిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వారి కోసం సంప్రదించాల్సి ఉంటుందని హోంశాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో చిక్కుకుపోయిన వారి కోసం సందీప్ కుమార్ సుల్తానియా అనే అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది.

గుజరాత్ రాష్ట్రంలో ఉండిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారి కోసం పీ.భారతి, వి.చంద్రశేఖర్ అనే అధికారులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వారికోసం అమితాబ్ కౌశల్ అనే అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. కర్ణాటకలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల కోసం ఎన్.వి.ప్రసాద్ మాలినీ కృష్ణమూర్తి అనే అధికారులను సంప్రదించాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ వారి కోసం విక్రం గోపాల్ అనే అధికారిని, రాజస్థాన్‌లో ఉన్న వారి కోసం జంగా శ్రీనివాస రావు అనే అధికారిని, మహారాష్ట్రలో ఉన్న వారి కోసం నితిన్ కరీర్ అనే అధికారిని, తమిళనాడులో చిక్కుకుపోయిన వారికోసం అతుల్య మిశ్రా అనే అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. వీరందరికీ సంబంధించిన ఫోన్ నెంబర్‌లతో కూడిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

ఫోన్ నెంబర్ల వివరాలు:

ఎంటి కృష్ణబాబు – 09177611110 సందీప్ సుల్తానియా – 07997950008 పీ. భారతి – 09978408545 పీ. చంద్రశేఖర్ – 09845044606 అమితాబ్ కౌశల్ – 09431160011 ఎన్వీ ప్రసాద్ – 09448146360 మాలినీ కృష్ణమూర్తి – 09480800026 కిరణ్ గోపాల్ – 09425163993 జంగా శ్రీనివాస్ రావు – 09929799297 నితిన్ కరీర్ – 022-2202 7990 అతుల్య మిశ్రా – 09940341445

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu