అదిరిపోయే శుభ‌వార్త‌..ఇక‌పై పెట్రో ఉత్ప‌త్తుల హోం డెలివరీ..!

ఇతర నిత్యావసర స‌రుకుల మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీని ఇంటికే డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో ప‌ర్మిష‌న్స్ ఇవ్వనున్నట్లు స‌మాచారం. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ రూల్స్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు సౌల‌భ్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018 నుంచి.. కొన్నిసిటీల‌లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను ఇంటి వ‌ద్ద‌కే డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో న‌డిచే స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ […]

అదిరిపోయే శుభ‌వార్త‌..ఇక‌పై పెట్రో ఉత్ప‌త్తుల హోం డెలివరీ..!
Ram Naramaneni

|

May 30, 2020 | 11:52 PM

ఇతర నిత్యావసర స‌రుకుల మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీని ఇంటికే డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో ప‌ర్మిష‌న్స్ ఇవ్వనున్నట్లు స‌మాచారం. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ రూల్స్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు సౌల‌భ్యంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018 నుంచి.. కొన్నిసిటీల‌లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను ఇంటి వ‌ద్ద‌కే డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో న‌డిచే స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ పెట్రోల్ పంప్‌ల తయారీకి రెడీ అంటోంది. వాటి ద్వారా వాహ‌న‌దారుల ఇళ్ల‌వ‌ద్ద‌కే పెట్రోల్‌ సరఫరా చేసే సౌల‌భ్యం ఉంటుంది. ఈ ఫైనాన్సియ‌ల్ ఇయ‌ర్ లో 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను త‌యారు చేస్తామని ఆ కంపెనీ వెల్ల‌డించింది.

ఇక మ‌రోవైపు సీఎన్‌జీ, పీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ వంటి అన్ని రకాలైన ఇంధనాలు ఒకే చోట‌ లభ్యమయ్యేలా ఇంధన స్టేషన్లను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని మంత్రి వివ‌రించారు. ఇదే క్ర‌మంలో ఆయా స్టేష‌న్ల వ‌ద్ద‌ జనాలు బారులు తీరి ఉండకుండా చూసేందుకు… ప్లాన్స్ రెడీ చేస్తున్నామని తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu